
గాసిప్స్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్(Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. రైడ్‌కు రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదన్నారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. సదరు వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్‌ని హైదరాబాద్ పోలీస్ వాట్సప్ నంబర్ 9490616155కు పంపాలని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!