

ఇటీవల శాసనమండలి సమావేశాల్లో సంబంధిత మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాహనాలపై నకిలీ వీఐపీ స్టిక్కర్ల దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వంటి హోదాలతో నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటిస్తూ ప్రజలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ, ఇలాంటి వాహనాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ టోల్ రుసుములు తప్పించుకునేందుకు చట్టవిరుద్ధ స్టిక్కర్లను వినియోగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
గతంలో ప్రజాప్రతినిధులకు పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారిక స్టిక్కర్లు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం వాటి దుర్వినియోగం అధికమైందని అధికారులు వెల్లడించారు. టోల్ చెల్లించకుండా హైవేల్లో తిరిగే కార్లు, బైకులు, ఆటోలు, నలుపు పైపు మఫ్లర్లతో నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. నకిలీ స్టిక్కర్లు వినియోగించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!