
ఆరోగ్యం

జాహ్నవి మరణం అనంతరం ఆమె తండ్రి శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, న్యాయం కోసం నిరంతరంగా పోరాటం కొనసాగించారు. తీవ్ర మనోవేదనలో ఉన్న ఆయన కొంతకాలం విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. ఇటీవల ఆయనకు అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ కేటాయించడంతో విధుల్లో చేరేందుకు అక్కడికి వెళ్లారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో శ్రీకాంత్‌కు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాహ్నవి మరణంపై న్యాయపోరాటం అనంతరం పరిహారం మంజూరైన విషయం తెలిసేలోపే ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!