

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహిస్తారు. ప్రణాళిక శాఖ ఈ మొత్తం కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 2 న గ్రామ స్థాయిలో గ్రామ సభలు, వచ్చే నెల 16 న మండల స్థాయిలో సమావేశాలు, మే 2 న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22 న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2 న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుతారు. ఈ నెల 6 న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతాయి.
ఈ 99 రోజుల కార్యక్రమాన్ని శాఖల వారీగా 10 ముఖ్య అంశాలపై నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత, సంక్షేమ పథకాలు, పిల్లల భద్రత మరియు డ్రగ్స్ నియంత్రణ, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఈ కాలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.






.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!