
న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్వంచలోని జ్యోతి నగర్లో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. నిన్నటి నుంచి పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తమ పిల్లలు కనిపించకపోవడంతో తక్షణమే పాఠశాల సిబ్బందికి, తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలో భద్రత పూర్తిగా లేనట్టుగా విద్యార్థి సంఘాలు విమర్శించాయి. అక్కడ వాచ్మన్ లేకపోవడం, సీసీటీవీ కెమెరాలు లేకపోవడం, మౌలిక భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి అంశాలను వారు ప్రశ్నించారు.
పిల్లలను వీలైనంత త్వరగా కనిపెట్టాలని తల్లిదండ్రులు పోలీసులను అభ్యర్థిస్తున్నారు.






.png&w=3840&q=75)










.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!