
గాసిప్స్
.png&w=3840&q=75)
హైదరాబాద్ రోడ్లపైకి బుధవారం 65 ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కనున్నాయి. ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపో లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్ టి సి ఎండీ వై.నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభిస్తారు.
ఉదయం పది గంటలకు బస్సుల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్ టి సి వివిధ రూట్లలో నడుపుతోంది.

















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!