
న్యూస్

హైదరాబాద్‌లో ఇండిగో విమానాల సంక్షోభం మరింత తీవ్రతరమైంది. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 14 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 44 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఈ ఆకస్మిక మార్పులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నం నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు నడిచే 6 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు విమానయాన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి.
దేశవ్యాప్తంగా సేవల్లో ఏర్పడిన అంతరాయం దృష్ట్యా స్పైస్‌జెట్ అత్యవసరంగా 100 అదనపు విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, ప్రయాణికుల రవాణా కోసం రైల్వే శాఖ మరియు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!