
గాసిప్స్
.webp&w=3840&q=75)
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కీలక మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 164 విమానాశ్రయాలను 2047 నాటికి 350కి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. భారత విమానయాన సంస్థలు ఇప్పటికే సుమారు 1,700 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని, అవి అందుబాటులోకి వస్తే దేశీయ విమానయాన సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు.
భారత విమానయాన రంగం ఏటా 10 నుంచి 12 శాతం వృద్ధిరేటుతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ ఎదిగిందని మంత్రి వెల్లడించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని విస్తరించడం ద్వారా గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!