

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేరవేసే ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులకు కోటికి పైగా ప్రమాద బీమా అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ పథకం ద్వారా సింగరేణిలో 38,000 మంది ఉద్యోగులు, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులు లబ్ధిపొందుతున్నారని, ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకూ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!