

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో విశాఖపట్నం–విజయవాడ మార్గంలో 12 ప్రత్యేక జన్సాధారణ్ (అన్రిజర్వ్డ్) రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రిజర్వేషన్ అవసరం లేకుండా ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందించనున్నాయి.
విశాఖ–విజయవాడ జన్సాధారణ్ ఎక్స్ప్రెస్ (08567) రైలు విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే విజయవాడ–విశాఖ ప్రత్యేక రైలు (08568) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!