

సాంకేతిక అభివృద్ధిలో భాగంగా కృత్రిమ మేధస్సు ఎన్నో కొత్త అవకాశాలను అందిస్తోంది. అదే సమయంలో దాని దుర్వినియోగం సినీ పరిశ్రమకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ సాంకేతికతతో నటీనటుల ముఖాలను మార్ఫింగ్ చేసి అసత్య వీడియోలను రూపొందించడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో అవి వేగంగా వ్యాపించడంతో సంబంధిత వ్యక్తుల పరువు, వ్యక్తిగత గోప్యత, డిజిటల్ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ తరహా ఘటనల్లో హీరోయిన్లను లక్ష్యంగా చేసుకున్న నకిలీ కంటెంట్ ఎక్కువగా కనిపించడం మరింత కలవరపెడుతోంది.
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ‘మా’ కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించి, ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, సాంకేతిక సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. నకిలీ కంటెంట్‌ను వేగంగా గుర్తించి తొలగించే వ్యవస్థ బలపడితేనే సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. లేకపోతే భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు దుర్వినియోగం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!