

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి తొలగించిన ఓ రొమాంటిక్ పాట తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. వెంకటేష్, నివేత పేతురాజ్‌పై చిత్రీకరించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో భాగంగా విడుదల కావాల్సిన ఈ పాటను కొన్ని కారణాలతో తుది వెర్షన్ నుంచి తొలగించినప్పటికీ, తాజాగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ పాటలోని సాహిత్యం, శృంగార సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఈ పాటను సినిమా నుంచి తొలగించి దర్శకుడు మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. గతంలోనే సినిమాలో నివేత పేతురాజ్ పాత్ర చిత్రీకరణపై విమర్శలు వ్యక్తమవగా, తాజాగా పాట విడుదలతో వివాదం మరింత ముదిరింది. ఒప్పందం ప్రకారం ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ పాటను విడుదల చేసినప్పటికీ, ఇలాంటి కంటెంట్‌ను రూపొందించడంపై త్రివిక్రమ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!