
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత శుక్రవారం అరుదుగా బహిరంగంగా కనిపించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ చిత్రాన్ని చెన్నైలోని కమలా సినిమాస్‌లో ఆమె వీక్షించారు. కుమార్తె దివ్య శాషాతో కలిసి థియేటర్‌కు వచ్చిన సంగీత.. కుమారుడి తొలి దర్శకత్వ చిత్రానికి మద్దతుగా నిలిచారు.
విజయ్‌తో విడాకుల కోసం సంగీత గతంలో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కేసును కొనసాగించకూడదని ఆమె ఆగస్టులో కోర్టుకు తెలిపిన నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సిగ్మా’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!