

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దేవర సినిమాలో విలన్‌గా నటించిన సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బెదిరింపుల వెనుక నిజంగా జీషన్ అక్తర్ ఉన్నాడా? లేక మరెవరైనా అతడి పేరును ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గతేడాది జనవరి 16న ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలోకి తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు చొరబడి ఆయనపై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు దాదాపు ఆరు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఐదు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి హత్య బెదిరింపులు రావడంతో బాలీవుడ్‌లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులకు కూడా గతంలో బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి ఘటన కూడా సినీ ప్రముఖుల భద్రతపై చర్చకు దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!