

విజయ్ సినిమా రంగంలో స్టార్‌గా ఎదిగిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చాటుతున్నారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీతో మంచి ప్రభావం చూపిన విజయ్, IMDb విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా సందర్శకుల పేజీ వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ రూపొందించినట్లు IMDb తెలిపింది. గత వారం 21వ స్థానంలో ఉన్న విజయ్, ఈ వారం టాప్ 2లోకి రావడం విశేషంగా మారింది.
నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2 సిరీస్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక సాయిపల్లవి, జునైద్ ఖాన్‌తో కలిసి నటించిన ఏక్ దిన్ విడుదల నేపథ్యంలో ఏడో స్థానంలో నిలిచారు. సినిమా, ఓటీటీ, రాజకీయ రంగాల్లో భారతీయ సెలబ్రిటీల పెరుగుతున్న ప్రభావాన్ని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!