

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో మరో ప్రాజెక్ట్ రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ విజయవంతం కావడంతో, తదుపరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుమ కనకాలతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌పై స్పందించారు.
ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కథ సిద్ధంగా ఉందని, అయితే టైటిల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని త్రివిక్రమ్ వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఓ పౌరాణిక కథను సిద్ధం చేశారని, ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే టైటిల్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!