

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. కుటుంబ కథాంశానికి క్రైమ్ థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. విడుదల తేదీ ఖరారైన తర్వాత సినిమా గురించి కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రత్యేకంగా రూపొందించిన ఓ రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. కథలో కీలక మలుపు తీసుకొచ్చే ఈ సన్నివేశంలో వినోదంతో పాటు ఉత్కంఠ కూడా సమపాళ్లలో ఉండేలా రూపొందించారని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఎపిసోడ్‌లో వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన హావభావాలు, సంభాషణలు, పరిస్థితుల నేపథ్యంలో వచ్చే హాస్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్వహిస్తున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!