

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. రూ.10 కోట్లు చెల్లించాలని హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి వాయిస్ నోట్ పంపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రణ్వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు అమెరికా ఫోన్ నంబర్ నుంచి ఈ సందేశం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ నంబర్ వివరాల కోసం అమెరికా అధికారులను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు కావాల్సి ఉంది.
ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు జరగడం, నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా సంచలనం సృష్టించింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తులకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దేశవాళి తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. అలాగే ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్ సభ్యుడు శుభమ్ లోంకర్‌కు ఈ ఘటనలతో సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలు సినీ ప్రముఖుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!