
సినిమాలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK-111 సినిమా షూటింగ్ సందర్భంగా కాకినాడ పోర్టులో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఆయనకు స్వల్ప గాయం అయింది. తొలుత కాలుజారి పడిపోవడంతో మోకాలికి గాయమైందని వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా అసలు విషయాన్ని వెల్లడించారు.
యాక్షన్ సీక్వెన్స్ సమయంలో బాలకృష్ణకు స్వల్ప మసిల్ టియర్ అయ్యిందని, వైద్యుల సూచన మేరకు పూర్తిగా కోలుకునేందుకు మైనర్ సర్జరీ నిర్వహించాల్సి వచ్చిందని గోపీచంద్ తెలిపారు. బాలయ్య క్రమశిక్షణ, అంకితభావం చిత్రబృందానికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన త్వరలోనే కోలుకుని షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!