
బిజినెస్

'లెనిన్' సక్సెస్ మీట్ సందర్భంగా టాలీవుడ్ నటుడు శివాజీ సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 40 సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయని, వాటి ద్వారా సుమారు 10 వేల మంది కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తోందని తెలిపారు.
ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని శివాజీ కోరారు. ఏపీ యువతకు మరిన్ని అవకాశాలు రావాలంటే సినీ పరిశ్రమ రాష్ట్రానికి రావడం అవసరమని అన్నారు. అలాగే 'లెనిన్' సినిమా విజయంలో కథే 200 శాతం ప్రధాన కారణమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!