
బిజినెస్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. జూలై 10న విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ, తొలి వారంలోనే రూ.100 కోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని గుంటూరులో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ ప్రారంభానికి ముందు 'అయ్యగారే నం.1' అంటూ అభిమానుల్లో గుర్తింపు పొందిన డైహార్డ్ ఫ్యాన్ నాగరాజును అఖిల్ కలిశారు. అఖిల్‌ను చూసిన నాగరాజు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా, అఖిల్ అతడిని హత్తుకుని ఓదార్చారు. 'అయ్యగారు' అనే పేరు తనకు రావడానికి నువ్వే కారణమని చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!