
బిజినెస్

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే సినిమాలకు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ధృవీకరణను తప్పనిసరి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'సత్లుజ్' సినిమా వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఐటీ నిబంధనలు–2021లో కీలక సవరణలు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
సీబీఎఫ్‌సీ సమీక్ష పూర్తికాకముందే జీ5లో సత్లుజ్ స్ట్రీమింగ్ కావడంతో వివాదం చెలరేగింది. దేశ సార్వభౌమాధికారం, భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో జూలై 3న ఆ చిత్రాన్ని తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అనుమతి లేని ప్రదర్శనలను అడ్డుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!