

ఆహా ఓటీటీ లో హిట్ అయిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేష్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరిస్ రెండో సీజన్ డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సీజన్లో రాశీ సింగ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్.కేఎన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి షో రన్నర్ గా పనిచేస్తుండగా, కథ, స్క్రిప్ట్‌ను రవి నంబూరి మరియు సందీప్ బొల్ల రాశారు. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
నేడు సిరీస్ లోని లైఫ్ ఈజ్ ఎ గేమ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు భాస్కర భట్ల రవి కుమార్ ప్రేరణాత్మకమైన లిరిక్స్ రాయగా, లిప్సిక అందమైన స్వరంతో పాడారు. సంగీత దర్శకుడు అజయ్ అరసాడ క్యాచ్ వై ట్యూన్ అందించారు. సీజన్ 2 లో ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు వెకేషన్‌ను ఎంజాయ్ చేసే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు.
పాట సారాంశం చూస్తే, జీవితం అనే ప్రయాణాన్ని పోరాటం, కలలు, బాధలు, ధైర్యంతో ముందుకు తీసుకెళ్లే భావనను సూటిగా చెబుతుంది. పలు లొకేషన్‌ల్లో ఈ పాటను గ్రాండ్‌గా పిక్చరైజ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!