
సినిమాలు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కామాక్షి భాస్కర్ల మహాదేవి పాత్రలో నటించిన ఈ చిత్రం మహిమ అనే యువతి హత్య వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే కథగా సాగుతుంది. ఆత్మలు, మంత్ర తంత్రాలు, సాతానిక్ శక్తులు వంటి భయానక అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పెంచుతోంది.
ట్రైలర్‌లో కనిపించే క్షుద్ర పూజలు, రహస్యమైన సంఘటనలు, గగుర్పొడిచే విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కాశీ విశాలాక్షి బలుసు నిర్మించగా, శ్రీ ఆది వారాహ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!