
జనరల్

‘మైసా’ సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో గాయపడిన హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. వైద్యులు సూచించిన మేరకు ఆమె ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో గాయాలు తనకు చాలా చిరాకు తెప్పిస్తాయని, ఇది తనకు జరిగిన మూడో పెద్ద గాయమని తెలిపారు.
డ్యాన్స్ షూట్ సమయంలో కుడి తుంటిలోని ఒక టెండన్ దెబ్బతినడంతో ప్రస్తుతం కాలును పైకి ఎత్తడం కూడా కష్టంగా ఉందని రష్మిక వెల్లడించారు. ‘మైసా’ తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సినిమా అని చెప్పిన ఆమె, ఈ గాయం తనకు తప్పనిసరి విశ్రాంతిని ఇచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఆమె నటిస్తున్న సినిమాలు, బ్రాండ్ ప్రకటనల షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!