
టెక్నాలజీ

యంగ్ హీరో రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మాయలేడి’ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. దర్శకుడు ప్రశంకర్ రూపొందించిన ఈ చిత్రం ప్రేమ, యాక్షన్, మిస్టరీ అంశాల సమ్మేళనంగా కనిపిస్తోంది. కథానాయిక గురించి తెలుసుకుంటూ ఆమెపై హీరోకు పెరిగే ఆసక్తి, అనంతరం చోటుచేసుకునే ఊహించని పరిణామాలు, యాక్షన్ సన్నివేశాలు గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
ఫ్రెష్ లుక్‌లో కనిపించిన రాకేష్ వర్రే తన నటనతో ఆకట్టుకోగా, మధుమిత సర్కార్ పాత్రలోని మిస్టరీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌కు మరింత బలం చేకూర్చింది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!