
గాసిప్స్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని విన్‌ఫాస్ట్ సంస్థ కార్యాలయం ఎదుట ఓ కస్టమర్ నిరసన తెలిపారు. తన ఎలక్ట్రిక్ కారును కంపెనీ వెనక్కి తీసుకుని పూర్తి డబ్బులు రీఫండ్ చేయాలని డిమాండ్ చేశారు. నల్లం ఫణి కుమార్ రాజా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.25 లక్షలు పెట్టి విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు.
అయితే కారులో ఏసీ డ్రెయిన్ పైప్ డిజైన్ సరిగా లేకపోవడంతో నీరు కార్పెట్ కింద చేరి ఫ్లోర్ తడుస్తోందని ఆయన ఆరోపించారు. సర్వీస్ సెంటర్‌కు ఇచ్చినప్పటికీ కార్పెట్ మాత్రమే ఆరబెట్టి ఇచ్చారని, అసలు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు. కంపెనీకి మెయిల్స్ పంపినా, డీలర్‌ను సంప్రదించినా స్పందన లేకపోవడంతో పూర్తి రీఫండ్ కోరుతున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!