

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగ నియామక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ చిహ్నాలు, అధికారిక ముద్రలు, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పేరు, మంగళగిరిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ చిరునామాను అక్రమంగా ఉపయోగించి నకిలీ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూ లేఖలు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సీఐడీకి ఆరోగ్య శాఖ ఫిర్యాదు చేసింది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు కేవలం ఏపీఎంఎస్‌ఆర్‌బీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారానే జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే పరిశీలించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!