

ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) చేపట్టే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఏటా పెరుగుతున్న రికార్డు స్థాయి ధాన్యం సేకరణకు అనుగుణంగా గోడౌన్ల సామర్థ్యాన్ని విస్తరించడం అవసరమని పేర్కొన్నారు. సచివాలయంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అనూజ్ త్యాగితో జరిగిన సమావేశంలో ధాన్యం సేకరణ, రవాణా, భవిష్యత్ నిల్వ అవసరాలపై చర్చించారు.
వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో గోడౌన్లు నిర్మించి నిల్వ వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర పూల్ నిల్వ సామర్థ్యం 31 లక్షల టన్నులు ఉండగా, ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం మరో 16.25 లక్షల టన్నుల సామర్థ్యం అవసరమని వెల్లడించారు. అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పాటుకు అనుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!