
టెక్నాలజీ

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’పై దర్శకుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ సంస్థలు పనిచేస్తుండగా, దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!