

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ ద్వారా ఆమె టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. చిత్రంలో యోగిబాబు, సంజయ్ దత్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసిన సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్, సందీప్ రెడ్డి వంగాపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆయన ఎప్పుడూ హడావిడి, ట్రెండ్ లేదా పాపులారిటీని కాకుండా, నటీమణుల ప్రత్యేకతను ప్రధానంగా చూసేవారని తెలిపింది. కియారా అద్వానీ, త్రిప్తి డిమ్రీ వంటి నటీమణులకు పెద్ద అవకాశాలు ఇవ్వడం కూడా ఆయన విధానం అని పేర్కొంది.
మాళవిక, ప్రభాస్తో ‘ది రాజా సాబ్’లో నటించడం తనకు సంతోషంగా ఉందని, ప్రశాంత్ నీల్ ఆమెను ఫోటోషూట్ కోసం కాకుండా వ్యక్తిగతంగా కలవాలని అనుకున్నారని, అయితే కొన్ని కారణాల వల్ల భేటీ జరగలేదని వెల్లడించింది. ఇండస్ట్రీలో అవకాశాలు, టైమింగ్, పరిస్థితులు ఎంత కీలకమో తన ప్రయాణమే ఉదాహరణ అని ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!