

మేమ్ ఫేమస్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్, 'గోదారి గట్టుపైన' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు సుబాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతి బాబు, రాజీవ్ కనకాల వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ గోదావరి ప్రాంతపు గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.
గోదావరి తీరంలో సాగిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఆస్కార్ర్ గ్యాంగ్’గా పిలవబడే స్నేహితుల గుంపు చుట్టూ తిరుగుతుంది. రాజు అనే సరదా మనస్తత్వం కల యువకుడిగా సుమంత్ ప్రభాస్ కనిపిస్తుండగా, మాయ (నిధి ప్రదీప్)తో అతని ప్రేమకథ హాస్యంతో, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో సాగుతుంది. అందమైన సినిమాటోగ్రఫీ, గ్రామీణ సొగసు నిండిన విజువల్స్, హాయిగా సాగే సంగీతంతో గోదారి గట్టుపైనా ఓ ఫీల్ గుడ్ రూరల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!