
గాసిప్స్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరిన 113 రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో ఆయన రాజకీయ ప్రయాణం స్వల్పకాలంలోనే ముగిసింది.
రాజీనామాకు గల కారణాలను చంద్ర కుమార్ బోస్ ఇంకా వెల్లడించలేదు. అయితే నేతాజీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన నిర్ణయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ పరిణామంపై అనేక స్పందనలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!