

భారత్‌ను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం 2026–27 నుంచి 2030–31 వరకు అమలు కానున్న పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు (NSFs) ఆర్థిక సహాయానికి కలిపి రూ.36,441 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. ప్రతిభావంతులైన క్రీడాకారులను చిన్న వయసులోనే గుర్తించి, వారికి శాస్త్రీయ శిక్షణ, ఆధునిక కోచింగ్ అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటివరకు 1,067 ఖేలో ఇండియా కేంద్రాలు, 267 గుర్తింపు పొందిన అకాడమీలు, 349 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేయగా, వాటిపై రూ.3,176 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం 2,745 మంది అథ్లెట్లకు కోచింగ్, క్రీడా సామగ్రి, వైద్య సేవలు, నెలవారీ భృతి అందుతోంది. 2018 నుంచి 63 వేల మందికి పైగా అథ్లెట్లు ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనగా, గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానం సాధించడం దేశ క్రీడా పురోగతికి నిదర్శనంగా ప్రభుత్వం పేర్కొంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!