

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో '12th Fail' చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విక్రాంత్ మాస్సే విజయాన్ని సినీ పరిశ్రమ ఘనంగా అభినందిస్తోంది. అయితే ఈ విజయానికి వెనుక ఆయన భార్య శీతల్ ఠాకూర్ చేసిన త్యాగాలు, చూపిన నమ్మకం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. టెలివిజన్‌లో విజయవంతమైన కెరీర్‌ను వదిలి అర్థవంతమైన సినిమాల కోసం విక్రాంత్ తీసుకున్న నిర్ణయం ఒక దశలో ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
ఆ క్లిష్ట సమయంలో షీతల్ ఆయనకు అండగా నిలిచి, తిరస్కరణలు ఎదురైనా ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేసింది. అనంతరం ఛపాక్, హసీన్ దిల్‌రుబా, 12th Fail వంటి చిత్రాల్లో విక్రాంత్ నటన ప్రశంసలు అందుకోగా, ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారంతో ఆయన కృషికి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ దంపతులు తమ కుమారుడు వర్దాన్తో కలిసి ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!