

సూపర్‌స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రత్యేక అప్డేట్లు విడుదల కావడంతో వేడుకలు మరింత సందడిగా మారాయి. ‘వారణాసి’ చిత్రబృందం ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేయగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఓ ప్రత్యేక వీడియో అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో కృష్ణ గారు చెప్పిన ఐకానిక్ డైలాగ్‌ను ఏఐ సాంకేతికతతో పునఃసృష్టించి, అందులో మహేష్ బాబును చూపించారు. ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.
మహేష్ బాబు–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై చాలాకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఈ వీడియో మరింత బలం చేకూర్చింది. వీరిద్దరి కలయికలో ‘డెవిల్’ అనే ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’తో, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’తో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ‘డెవిల్’పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!