
రాజకీయాలు

ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలోని కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా సుమలత, రఘు మాస్టర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు.
సమావేశంలో సుమలతకు 11 మంది డ్యాన్సర్లు మద్దతు తెలపగా, రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!