

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సినిమా కథ, సెన్సార్ టాక్, ఇప్పటివరకు వినిపిస్తున్న స్పందనపై ఆసక్తి నెలకొంది. చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ లభించగా, తీవ్రమైన రక్తపాతం, రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ ప్రక్రియలో 21 మార్పులు సూచించడంతో పాటు కొన్ని అభ్యంతరకరమైన డైలాగులను మ్యూట్ చేసినట్లు సమాచారం. మార్పుల అనంతరం సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఖరారైంది.
ఇప్పటివరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. 1984 నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో అణచివేతకు గురైన సవారీ జాతికి చెందిన జడల్ జమానా పాత్రలో నాని కనిపిస్తారు. తన జాతిపై వివక్షకు వ్యతిరేకంగా జడల్ చేసే పోరాటం చుట్టూ కథ సాగుతుందని సమాచారం. సినిమాలో నాలుగు భారీ యాక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్ట్, చివరి 40 నిమిషాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. నాని నటన, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలుస్తాయని ఇప్పటివరకు వచ్చిన టాక్ సూచిస్తోంది. తల్లి-కొడుకు అనుబంధం కూడా కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పందనలో ఎంతవరకు నిజం ఉందో, సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో పూర్తి స్థాయిలో ప్రీమియర్స్ తర్వాతే స్పష్టమవుతుంది.



















కామెంట్స్ (1)
Best of Luck Paradise Team