

జాతీయ అవార్డు అందుకున్న ‘కలర్ ఫొటో’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రాజ్.. తన తొలి చిత్రం తర్వాత తెరకెక్కించాలనుకున్న ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై స్పందించారు. ఈ కథను తొలుత రవితేజను హీరోగా ఊహించుకుని రాసినట్లు తెలుస్తోంది. కీలక పాత్రల కోసం విశ్వక్ సేన్, మంచు మనోజ్‌లను కూడా సందీప్ రాజ్ అనుకున్నారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ క్రమంగా వెనక్కి వెళ్లి ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది.
ఇటీవల ఓ నెటిజన్ ఈ సినిమా గురించి సందీప్ రాజ్‌ను ప్రశ్నించగా.. దాని ప్రస్తుత పరిస్థితిపై ఆయన స్పందించారు. ఈ దశలో ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు తాను సిద్ధంగా లేనని, దాన్ని తెరకెక్కించడానికి మరింత అనుభవం అవసరమని తెలిపారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న సందీప్ రాజ్.. సరైన సమయంలో కథకు న్యాయం చేసే స్థాయిలో దాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!