
జనరల్

ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా రాబోయే లైవ్ స్టాండప్ కామెడీ టూర్‌కు భారీ స్పందన లభిస్తోంది. టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న టికెట్ల ధరలు సీటింగ్ కేటగిరీ, వేదికను బట్టి రూ.1,000 నుంచి రూ.7,000 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
టికెట్లు వేగంగా అమ్ముడవడం సమయ్ రైనాకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆయన నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ యూట్యూబ్ సిరీస్ విజయంతో సమయ్ రైనాకు మరింత ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన లైవ్ షోలకు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!