

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఎట్ హోమ్’ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి గౌరవనీయమైన వేదికపై సమంత హాజరుకావడం ఆమె కెరీర్లో అరుదైన ఘట్టంగా మారింది.
ఈ సందర్భంగా సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ, తాను సామాన్య స్థాయి నుంచి వచ్చి ఇలాంటి గొప్ప వేదికపై నిలబడతానని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. సరైన మార్గనిర్దేశం లేకున్నా కేవలం కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగడం వల్లే ఈ గౌరవం దక్కిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా, సెకండ్ ఇన్నింగ్స్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!