
జనరల్

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
మొదట మార్చిలో విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను, మిగిలిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. తరువాత జూన్‌లో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ తేదీని వెల్లడించలేదు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఒక ఇంటర్వ్యూలో జూన్ 25ను ప్రస్తావించడంతో అదే ఫిక్స్ అని వార్తలు వచ్చాయి. మరోవైపు అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ జూన్ 26న విడుదలకు సిద్ధమవుతుండటంతో పోటీపై సందేహాలు నెలకొన్నాయి. అయితే యశ్ నటించిన ‘టాక్సిక్’ వాయిదా పడటంతో ‘పెద్ది’కి క్లియర్ రిలీజ్ విండో లభించింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!