

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి భారతీయ సినిమా ప్రమాణాలను పెంచుతూ ‘వారణాసి’ ప్రాజెక్ట్‌లో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీతో చిత్రీకరించబడుతోంది. ఈ సదుపాయం ద్వారా 360 డిగ్రీల ప్రీ-విజువలైజేషన్, రియల్ టైమ్ వర్చువల్ ప్రొడక్షన్, డిజిటల్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ టెక్నాలజీ సహాయంతో సుమారు 25 నిమిషాల భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తిగా చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో మహేష్ బాబు తో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని టాక్. జార్జియాలో కీలక షెడ్యూల్ పూర్తిచేసిన చిత్ర బృందం, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించింది. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ చిత్రం, రాజమౌళిని మరోసారి ఇండియన్ సినిమా గేమ్‌చేంజర్‌గా నిలబెట్టనుంది.

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!