
బిజినెస్

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రం నుంచి ‘నీ వెనకే’ అనే అందమైన మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించగా, ఆయన గాత్రం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతి జావన సాహిత్యం అందించగా, శేఖర్ మోపురి స్వరపరిచిన ఈ గీతం ఫీల్‌గుడ్ మెలోడీగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ‘డిస్కో లైట్’ పాట విజయానంతరం ఈ సాంగ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!