

కోలీవుడ్‌లో నటి త్రిష చుట్టూ కొనసాగుతున్న వివాదంపై హీరో విశాల్ మరోసారి స్పందించారు. త్రిషపై ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు, అరెస్ట్ వంటి పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన కాలేజీ క్లాస్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్‌కు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని విశాల్ తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన మకుటం ఆడియో లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఉదయనిధి, ఆయన భార్య కృతిగపై తనకు ఎప్పటికీ ప్రేమ, అభిమానం ఉంటాయని చెప్పారు.
భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వచ్చినా, తమ రాజకీయ మార్గాలు వేరైనా అది కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని విశాల్ స్పష్టం చేశారు. తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేదా శత్రుత్వానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. గతంలోనూ ఉదయనిధి అరెస్ట్ రాజకీయాల్లో సహజమైన పరిణామమని విశాల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన మకుటం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!