

నటి సమీరా రెడ్డి ఇటీవల తన తండ్రికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రి వయసు ఏకంగా 93 ఏళ్లు అని ఆమె వెల్లడించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వయసు 90 దాటినా ఆయన ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపిస్తుండటంతో పలువురు ఆయనను చూసి 60 ఏళ్ల వ్యక్తిలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఫిట్‌నెస్, యవ్వనంగా కనిపించే తీరు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
తన తండ్రి ఇంత బలంగా, ఉత్సాహంగా ఉండటానికి అసలు కారణం ఏమిటని సమీరా అడగగా.. ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. “నా మనసు” అని ఆయన సింపుల్‌గా సమాధానమిచ్చారు. ఈ మాటలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు, యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్ల కంటే మానసిక బలం, సానుకూల ఆలోచనలు, జీవితంపై మంచి దృక్పథమే వయసును ఆరోగ్యంగా ఎదుర్కోవడంలో కీలకమని ఆయన సమాధానం మరోసారి గుర్తుచేస్తోందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!