
జనరల్

నటుడు ప్రకాశ్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వరావుకు మద్దతు ప్రకటించారు. ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేసిన ఆయన, నాగేశ్వరావు ప్రజల పక్షాన నిలబడి అనేక రాజకీయ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలోని ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు చేయడం సరికాదని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక భయపెట్టే రాజకీయ సంస్కృతా అని ప్రశ్నించారు.
నాగేశ్వరావు వ్యాఖ్యల్లో తప్పు ఉంటే ఆధారాలతో ఎదుర్కోవాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, కేసులతో భయపెట్టడం సరైంది కాదన్నారు. ఆయన గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, జగన్, రేవంత్ రెడ్డి, బీజేపీ వంటి నాయకులను ప్రశ్నించారని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!