

కోయంబత్తూర్లో 10 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటన తమిళనాట తీవ్ర కలకలం రేపింది. దుకాణానికి వెళ్లి అదృశ్యమైన చిన్నారి మృతదేహం తర్వాత చెరువులో లభ్యమైంది. ఈ కేసులో కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందిస్తూ ఈ ఘటనను అమానవీయ చర్యగా ఖండించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని టీవీకే ఎమ్మెల్యే ఎన్ఎం కుమార్ ఆసుపత్రిలో పరామర్శించారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వివాదానికి దారితీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే నేరాలు పెరిగాయని డీఎంకే విమర్శించింది. మహిళల భద్రతపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే గత డీఎంకే ప్రభుత్వమే శాంతిభద్రతలను దెబ్బతీసిందని బీజేపీ నేత నారాయణన్ తిరుపతి ఆరోపించారు. కన్నంపాళైయం ప్రాంతానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం కనిపించకుండా పోయి, తర్వాత చెరువులో మృతదేహంగా లభ్యమైంది. బైక్పై తీసుకెళ్లినట్లు తేలడంతో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!