

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న నాన్న కుట్టి సినిమా షూటింగ్ పూర్తయింది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తండ్రీకూతుళ్ల బంధాన్ని ప్రధానంగా చూపించే ఈ సినిమాలో విజయ్ ఆంటోని ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో ఆయన రక్తంతో ఉన్న లుక్, తీవ్ర భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ కథ ఎంత గాఢంగా ఉండబోతోందో సూచిస్తోంది. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!