

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన కావడం విశేషం. కోల్‌కతాలోని మదర్ థెరెసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించిన అనంతరం ఆయన దిల్లీలోని సేవా తీర్థ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో విస్తృత చర్చలు జరపనున్నారు. మంగళవారం జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా, ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ అమెరికా నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారతీయుల సభ్యతను ప్రశంసిస్తూ చేసిన ఆ వ్యాఖ్యలు అమెరికాపై వ్యంగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. భారత్ పర్యటనలో రూబియో రక్షణ, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!